Thursday, July 10, 2008

సింగపూరు విద్యా విశేషాలు

చాలామందికి సింగపూరు ఒక పర్యాటక ప్రదేశం గానే తెలుసు కానీ పై చదువులు చదవాలి అనుకునే వారికి కుడా ఇది నిజం గా స్వర్గదామం అని చెపవచ్చు. ఇక్కడ యం. యస్. చేయదలచిన వారికి 2 యూనివర్సిటీలు ఉనాయి. రొండు కూడా వరల్డ్ వైడు ర్యాకింగ్స్ లొ టాప్ 30 లొ ఉనాయి. ఇక టాప్ 30 లొ ఉన్న యూనివర్సిటి లొ ఉండె బొదనా సిబంది గురించి పరిశొదానా సౌకర్యాల గురించి ప్రతేకం గా చెపాలిసిన పని లెదు అనుకుంట. ఇక్కడ విద్యా విదానం చాల ఫ్లాక్సిబుల్ గా ఉంటుంది.కొర్సులు ఏకువ తీసుకుని ఒక సంవస్తరం లొనె యం. యస్. పుర్తిచెయవచు లెదంటె 3 లెక 4 సెమిస్టర్లలొ పుర్తిచెయవచు. ఫుల్ టైము విద్యార్దులకి 2 సంవస్తరలు గరిస్ట కాలపరిమితి.

అడ్మిషన్ విషయానికి వస్తె ఇకడ యూనివర్సిటీ లొ సీటు సంపాదించటానికి ప్రత్యేకించి పరిక్షలు ఎవి రాయాల్సిన పని లెదు. కాకపొతె జి.అర్.ఈ, టొఫెల్, ఐ.ఈ.ల్.టి. యస్ లెదా గెట్ పరిక్షలొ మంచి స్కొరు తెచుకుంటె అడ్మిషన్ అవకాసాలు మరుగవుతాయి. ఎక్క్ పీరియన్సు ఉన్న మంచిదె.అంతె గాని స్పెషల్ గా ఎమి పరిక్షలు రాయకరలెదు.

ఇక వీసా విషయానికి వస్తె దీని గురుంచి మీరు పుర్తిగ మర్చిపొండి. అడ్మిషన్ వస్తె విసా వచినట్లె. విసా రాదు అనె ప్రసక్తె లెదు.తగిన ఫార్మాలిటిస్ అన్ని ఆన్ లైను లొ పుర్తిచెయవచు.

పైనాస్ విషయనికి వస్తె ఇక్కడ ఒక సెమిస్టర్ చదవటానికి 7500 సింగపూరు డాలరులు పీజు ఉంటుంది. ఇందులొ 90 శాతం ఇక్కడ యూనివర్సిటీ లొ ఉన బ్యాకు లొను ఇస్తుంది. మీరు ఒక సంవస్తరం లొ కొర్సు పుర్తి చెస్తె ((2 X 7500)X10%) 1500 సింగపూరు డాలరులు పీజు కటాలి. మిగిలిన 90% లొను మీ ఇస్టం వచినపుడు కట్టవచు. ఇక్ నెలకి మెయింటినెన్సు 500 నుంచి 800 సింగపూరు డాలరులు ఉంటుంది.

పార్టు టైము జబు అవకాశాలు తక్కువ. నను అడిగితె పార్టు టైము చెస్తు ఎకువ సెమిస్టెర్ లు చదివెకనా ఒక సంవస్తరం లొ కొర్సు ఫినిష్ చెసి ఫుల్ టైము జాబు చుసుకొవటం మెరుగు.ఉదొగం విషయానికి వస్తె నాకు తెలిసినతవరకు ఉదొగం అంత సులబం కాదు అల అని కస్టం కుడా కాదు. వరస్ట్ కెసులొ 4నుంచి 5 నెలలొ ఉదొగం దొరుకుతుంది. చదువుకుంటునె జబ్లు అప్ప్ల్య్ చెసుకుంటె ముందుగనె ఉదొగం సంపదించవచు.

కాని వచిన చికెంటంటె జీతం అమేరికా , లండన్ రేజి లొ ఉందదు. 2500 నుంచి 3500 సింగపూరు డాలరులు ఉంటున్ది ఫ్రషర్ కి.టాక్సులు గట్రా భాగ తక్కువె.

గ్రీను కార్డు గురించి చెపాలంటె దీనిగురించి కుడా మీరు మర్చి పొవచు. కొర్సు ఐన తరవాత పరిమినంట్ రెసిడెంటు ఇన్విటషన్ లెటరు వస్తుంది. మీకు కొర్సు ఫినిష్ అయ్యి జాబ్ ఆపర్ వస్తె ముందు టెంపరరి పరిమినంట్ రెసిడెంటు ఇచ్చి 1 నుంచి 4 నెలల తరవత పరిమినంట్ రెసిడెంటు ఇస్తారు.

ఇక వాతావర్ణం మన భారతదేశం లాగనె ఉంటుంది. బొజనం గట్రా బగానె దొరుకుతుంది. ఆచార వ్యవహారలని మెచుకొదగిన విదం గా ఉంటాయి. ప్రతేకించి ఆడ వాళ్ళు కయితె చుసుకునె పనె లెదు. వారికి విదెశాలొ చదువు కొవాలంటె ఇంతకు మించిన మంచి ప్రదెశం దొరాక పొవచు. ఇంకొ విషయం ఏంటంటె ఇకడ కొంచం లెడిస్ డామినేషన్ ఉంది.కాబటి నా తొటి అన్న దములకి నెను చెపేది ఎంటంటె ఒంటరి గా ఒంటి గంటకి ఆడ తొడు లెకుండా రొడు మిద తిరగొదు.


ఫైనల్ గా చెపెది ఎంటంటె నాలాటి తెలుగు మీడియం విద్యార్దులకి , పెద్దగా ఆర్దిక సౌకర్యం లెనివాళకి ఇది చాలా బటెర్. ఇంకొ విషయం ఎంటంటె ఇకడికి రావటానికి మీరు ఏ కన్స్లటెన్సిని కలవాల్సిన పని లెదు. అందుకనె ఇది అంతగా ప్రాచారం పొదలెదని నా డవుటు. లెకపొతె వాళు ఈ పటికె మనం వదన్నా వినకుండ వాయించెవాళు.


మరింత సమచారం కొసం కింద ఉన్న లికు మీద నొకండి.
http://admissions.ntu.edu.sg/pages/default.aspx
http://www.nus.edu.sg/




NOTE:
1)ఇది నా మొదటి ఫొస్టు. ఛాల తపులు ఉన్నాయి మనించాలి.
2)మీరు కామెంట్లు రాయకపొయిన పర్లెదు కాని ఇ సమాచారం యవరికైనా పనికొస్తుదెమొ అలొచించి వారికి అందిచండి.

క్రుతఙ్తతలు


-శివ రాజేష్

12 comments:

ఆయుర్వేదం said...

శివగారు,

మీరందించిన వివరాలు బాగున్నాయి. బ్లాగ్లోకానికి స్వాగతం. బ్లాగ్లోకంలో చెప్పాలంటే కొత్తగా వచ్చేవారికి కాస్త ప్రోత్సాహం తక్కువే. కామెంట్లు రాయకపోయినా పర్వాలేదు అంటూనే, రాస్తే బాగుణ్ణు అన్న ఆశ ఉంది మీకు ;-). కామెంట్ల కోసం చూడకుండా మనకు నచ్చింది రాసుకుపోవడమే. చూసే అదృష్టమున్నవారు మన బ్లాగులను చూస్తారు. lol

సూచనలు మీకు నచ్చితే:

వర్డ్ వెరిపికేషన్ తీసెయ్యండి. ఫాంట్ సైజు కొంచెం పెంచండి.

All the Best sir

Bolloju Baba said...

కొత్తగా వచ్చే వారికి ప్రో్త్సాహం తక్కువే అని ఏమీ భావించక్కరలేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టిన వారే. బాలారిష్టాలను దాటుకొని వచ్చిన వారే.
ఆల్ ద బెష్ట్
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

మంచి సమాచారం అందిస్తున్నారు. చాలా మందికి ఉపయొగపడతాయని నా నమ్మకం.

Sujata M said...

అలా ఏమీ లేదు అండీ... మీ పోస్ట్ చాలా సింపుల్గా.. పనికి వచ్చే సమాచారాన్ని అందించింది. మన మహేష్ గారిని చూడండి.. వస్తూనే.. హడావుడి లేకుండా అందరి దృష్టినీ ఆకర్షించేరు. ప్రోత్సాహం అన్న మాట అనొద్దు. మీ లో రాసే ప్రతిభ ఉంది గాబట్టి.. ఇంక విజృంభించెయ్యండి. మీకు మీరే ప్రోత్సహించుకోవాలి.

Anil Dasari said...

కామెంట్ల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీ అభిప్రాయాలు లేదా మీరందిస్తున్న సమాచారం ఎంతమందికి చేరుతుందనేదానిమీదనే దృష్టి పెట్టండి. All the best.

Anonymous said...

"కాబటి నా తొటి అన్న దములకి నెను చెపేది ఎంటంటె ఒంటరి గా ఒంటి గంటకి ఆడ తొడు లెకుండా రొడు మిద తిరగొదు." - ఇలాంటి చమక్కులుండాలేగానీ.., తప్పులదేముందిలెండి. చాలామందిమి బూతులతో మొదలెట్టినవాళ్ళమే, ఇంకా తప్పులు దిద్దుకుంటున్నవాళ్లమే!

Unknown said...

ఇన్ఫర్మేటీవ్ గా ఉంది టపా...
నెమ్మది మీద తప్పులు కూడా తగ్గించండి.

arvind said...

నాకు తెలిసి మీరు క్విల్ ప్యాడ్ ఉపయోగించొచ్చు, తెలుగు వ్రాయడంలో అనుభవం ఉన్నవారికైతే ఇది మంచిది, మీరు లేఖిని ప్రయత్నించండి చాలా వరకు తప్పులు తగ్గించొచ్చు, అన్నట్టు మీ సొంగపూర్ వివరాలు చాలా ఉపయోగ కరంగా ఉన్నాయి, మరిన్ని సింగపూర్ వివరాలు పొందుపరచండి.

Ravi said...

UR Article is good. But need to change some information according to the present situation.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

సింగపూర్ విశేషాలతో మీ టపా చాలా బావుంది.

రవిశేఖర్ హృ(మ)ది లో said...

information in the article is very nice.use for correct telugu "lekhini"

K V V S MURTHY said...

Good info.All the best..!